Ola cab: ఓలాక్యాబ్స్‌కు ఝలక్.. రూ. 95,000 కస్టమర్‌కు చెల్లించాలని కోర్టు ఆదేశం

దిశ, వెబ్‌డెస్క్: కస్టమర్‌ను మానసిక వేదనకు గురిచేసినందుకు, నాసీరకం సేవలు అందించినందుకు ఓలాక్యాబ్స్, కస్టమర్‌కు.latest telugu news

Update: 2022-08-19 17:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: కస్టమర్‌ను మానసిక వేదనకు గురిచేసినందుకు, నాసీరకం సేవలు అందించినందుకు ఓలాక్యాబ్స్, కస్టమర్‌కు రూ. 95,000 పరిహారం చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. జబేజ్ శామ్యూల్ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. జబేజ్ శామ్యూల్, 2021 ఓలాక్యాబ్‌‌ను బుక్ చేసుకున్నాడు. అతను, అతని భార్య, సహాయకుడు ముగ్గురు కూడా దాదాపు 4-5 కి.మీ దూరం క్యాబ్‌లో ప్రయాణించారు. క్యాబ్ అపరిశుభ్రంగా ఉండడంతో పాటు డ్రైవర్ ఏసీ ఆన్ చేయడానికి నిరాకరించడమే కాకుండా వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. రూ. 200 మించకూడని బిల్లుకు రూ. 861 బిల్లు వేశారు.

అధికంగా బిల్లు వేయడంపై ఓలా క్యాబ్స్‌ అధికారులకు అతను ఫిర్యాదు చేశాడు. కానీ కంపెనీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. దీంతో అతను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ దృష్టికి తీసుకొచ్చాడు. అతని మానసిక వేదనను పరిగణనలోకి తీసుకున్న కమిషన్, కస్టమర్‌కు రూ. 88,000 పరిహారం, విచారణ ఖర్చుగా రూ. 7,000 చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.

Similar News