Kia EV9 SUV :ఒక్క చార్జింగ్‌తో 501 కిలోమీటర్లు.. కియా కొత్త కారు

దక్షిణ కొరియాకు చెందినటువంటి కియా నుంచి దేశీయ విపణిలోకి కొత్తగా ఎలక్ట్రికల్ SUV కారు విడుదల కానుంది.

Update: 2023-06-19 15:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియాకు చెందినటువంటి కియా నుంచి దేశీయ విపణిలోకి కొత్తగా ఎలక్ట్రికల్ SUV కారు విడుదల కానుంది. ఈ EV మోడల్ పేరు ‘ఈవీ9’. ఈ వారంలో దీనిని విడుదల చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది మూడు వరుసల సీట్లను కలిగి ఉంటుంది. హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ప్లాట్‌ఫారమ్‌‌పై తయారు చేసిన రెండో కారు ఇది. కారు 99.8 కిలోవాట్-గంట బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒక్కచార్జింగ్‌తో 501 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. దీని ధర దాదాపు రూ. 52 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ కారును యూరప్, యునైటెడ్ స్టేట్స్, ఇతర మార్కెట్లలో రెండవ భాగంలో విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలను పెంచుకోడానికి సియోల్‌ ప్లాంట్‌లో ఏడాదికి 1,00,000 ఈవీ కార్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ చూస్తుంది.

Kia EV9 SUV Launch Date, Expected Price in India

Tags:    

Similar News