పండుగ సీజన్ వేళ రోజురోజుకు పడిపోతున్న బంగారం ధరలు!

Update: 2023-10-03 15:13 GMT

హైదరాబాద్: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ రాకతో బంగారం ధరలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దేశంలో పసిడి ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. మంగళవారం బంగారం రూ. 600 దిగొచ్చింది. గత కొన్ని వారాలుగా నెమ్మదిస్తున్న బంగారం గడిచిన నెలరోజుల్లో భారీగా తగ్గింది. అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్‌లు పెరగడంతో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుందనే సంకేతాల మధ్య ధరలు పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు దాదాపు 20.77 డాలర్ల వద్ద ఉంది.

మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 660 తగ్గి రూ. 57,380కి, వినియోగదారులు కొనే ఆభరణాల్లో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ. 600 దిగొచ్చి రూ. 52,600కి చేరుకుంది. వెండి సైతం పసిడి బాటలోనే కిలో ఏకంగా రూ. 2,000 పడిపోయి రూ. 73,500 వద్దకు చేరింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో పసిడి ధరలను గమనిస్తే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం న్యూఢిల్లీలో రూ. 57,530గా, ముంబైలో రూ. 57,380, చెన్నైలో రూ. 57,710, బెంగళూరులో రూ. 57,380, కోల్‌కతాలో రూ. 57,380గా ఉన్నాయి.

Tags:    

Similar News