రైతు సంఘాలు, స్వయం సహాయక బృందాల కోసం ఐఐఎంఆర్‌తో Flipkart భాగస్వామ్యం!

హైదరాబాద్: దేశీయ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ రైతు సంఘాలు(ఎఫ్‌పీఓ), స్వయం సహాయక బృందాలు(ఎస్‌హెచ్‌జీ) మార్కెట్ విస్తరణ కోసం..Latest Telugu News

Update: 2022-08-19 12:46 GMT

హైదరాబాద్: దేశీయ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ రైతు సంఘాలు(ఎఫ్‌పీఓ), స్వయం సహాయక బృందాలు(ఎస్‌హెచ్‌జీ) మార్కెట్ విస్తరణ కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్స్(ఐఐఎంఆర్)తో శుక్రవారం అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించింది. దీని ద్వారా ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫామ్‌లో వినియోగదారులకు వ్యవసాయ రంగాలు, ఎస్‌హెచ్‌జీలను దేశవ్యాప్తంగా మార్కెట్ విస్తరణకు సహాయం అందించనుంది.

ఐసీఏఆర్-ఐఐఎంఆర్ ఈ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అనుమతులకు మద్దతిస్తుంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ఎఫ్‌పీఓ, ఎస్‌హెచ్‌జీలకు అవసరమైన అవగాహన కల్పించేందుకు శిక్షణ, సామర్థ్యం పెంపు కార్యక్రమాలను నిర్వహించనుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన ఐసీఏఆర్-ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ సీవీ రత్నావతి, ఆహార, దాణా, పశుగ్రాసం, పోషకాహారం, బయో-ఇంధన అవసరాలను తీర్చేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ సహకారం ద్వారా చిన్న, సన్నకారు రైతులు, ఎఫ్‌పీఓలు తమ నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చని, వారి కార్యకలాపాలను మెరుగుపరుచుకోవచ్చని రత్నావతి వెల్లడించారు.

Similar News