22.3 శాతం తగ్గిన DishTv ఆదాయం

డిష్ టీవీ ఇండియా డిసెంబర్ 2022 తో ముగిసిన మూడవ త్రైమాసికంలో రూ. 2.85 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నివేదించింది.

Update: 2023-02-11 12:31 GMT

ముంబై: డిష్ టీవీ ఇండియా డిసెంబర్ 2022 తో ముగిసిన మూడవ త్రైమాసికంలో రూ. 2.85 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నివేదించింది. ఏడాది క్రితం అక్టోబర్-డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 80.21 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ప్రధానంగా దాని OTT ప్లాట్‌ఫారమ్ ఆదాయం, ప్రమోషన్‌లో క్షీణత కారణంగా ప్రస్తుతం EBITDA మార్జిన్‌పై ప్రభావం చూపింది. దీంతో కంపెనీ లాభం భారీగా తగ్గింది. సమీక్షించిన త్రైమాసికంలో ఆదాయం 22.31 శాతం తగ్గి రూ. 552.09 కోట్లకు పడిపోయింది, ఇది ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ. 710.67 కోట్లుగా ఉంది. డిష్ టీవీ ఖర్చులు 6.49 శాతం తగ్గి రూ. 567.16 కోట్లుగా ఉన్నాయి. సబ్‌స్క్రిప్షన్ ఆదాయాలు 33.82 శాతం తగ్గి రూ. 427.4 కోట్లుగా ఉన్నాయి.

Tags:    

Similar News