ఒకప్పుడు నష్టాలు.. ఇప్పుడు భారీ లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు

కరోనా కు ముందు దేశంలోని పలు కీలక ప్రభుత్వం బ్యాంకు సంస్థలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

Update: 2024-05-14 11:35 GMT

దిశ, వెబ్‌డెస్క్:కరోనా కు ముందు దేశంలోని పలు కీలక ప్రభుత్వం బ్యాంకు సంస్థలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పార్టీలు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కరోనా తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు క్రమంగా లాభాల బాట పట్టాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు రూ. 1.41 లక్షల కోట్ల నికర లాభాన్ని సాధించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అలాగే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 1-04 లక్షల కోట్లు ఆదాయం వచ్చింది. ఈ సారి 35 శాతం వృద్ధి నమోదైంది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వాటా 40 శాతం,( రూ. 61,077 కోట్లు) ఉండగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) రూ. 8,245 కోట్లు, యూనియన్ బ్యాంక్ రూ. 13,649 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ రూ. 2,549 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు తాజా నివేదికలు తెలుపుతున్నాయి. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటే లాబాలనే రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News