డేటా ధరలు పెరగడంపై ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం డిజటల్ టెక్నాలజీ క్రమంగా పెరుగుతున్న తరుణంలో మొబైల్ డేటా ధరలు అనూహ్యంగా పెరగడం చాలా ఆందోళనకర విషయమని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

Update: 2023-01-25 17:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం డిజటల్ టెక్నాలజీ క్రమంగా పెరుగుతున్న తరుణంలో మొబైల్ డేటా ధరలు అనూహ్యంగా పెరగడం చాలా ఆందోళనకర విషయమని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా టెలికాం కంపెనీలు రీచార్జ్ ధరలను భారీగా పెంచుతున్నాయి. దీని వలన వినియోగదారులు డేటా కొనుగోలు చేసే సామర్థ్యాన్ని కోల్పోతారు, దీంతో డిజిటలైజేషన్ విస్తరణ తగ్గిపోతుందని మంత్రి అన్నారు. ఇటీవల ఎయిర్‌టెల్ తన కనీస రీచార్జ్ ధరను 57 శాతం పెంచింది. అయితే ఈ విషయాన్ని ట్రాయ్ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Similar News