ఏప్రిల్-19: నేడు మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

మహిళలు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేస్తుంటారు.

Update: 2024-04-19 05:44 GMT

దిశ, ఫీచర్స్: మహిళలు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఓకేసారి పెరుగుతూ కొనుగోలు దారులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఏప్రిల్ నెలలో మాత్రం రోజు రోజుకు బంగారం రేట్లు పెరుగుతూ ప్రజలు బంగారం పేరు వింటేనే వణుకు పుట్టేలా చేస్తున్నాయి. తాజాగా, నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.

నిన్నటి ధరలతో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ. 500 పెరగడంతో 68, 150కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 540 పెరగ్గా రూ. 74, 340గా ఉంది. ఇక కిలో వెండి రూ. 90, 000గా ఉంది. అయితే ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 68, 150

24 క్యారెట్ల బంగారం ధర- రూ.74, 340

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 68, 150

24 క్యారెట్ల బంగారం ధర- రూ.74, 340

Similar News