సెన్సెక్స్ 4,000.. నిఫ్టీ 1146 పాయింట్ల పతనం

కరోనా వైరస్ మహమ్మారి భయాందోళనల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు అగాధంలోకి కూరుకుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా వైరస్ విజృంభించడంతో చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఇదే దారిలో భారత్‌ కూడా వెళ్లింది. దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ చేస్తున్నట్లు ఆది, సోమవారాల్లో తెలిపాయి. ఇది స్టాక్‌ మార్కెట్లపై పెను ప్రభావం చూపింది. ఈరోజు నష్టాలతో ట్రేడింగ్ మొదలైంది. కొద్ది సేపటికే బీఎస్‌ఈ సెన్సెక్స్ 2,000కు పైగా పాయింట్లు నష్టపోయింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు 4000 పాయింట్లు పతనమైంది. […]

Update: 2020-03-23 04:46 GMT

కరోనా వైరస్ మహమ్మారి భయాందోళనల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు అగాధంలోకి కూరుకుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా వైరస్ విజృంభించడంతో చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఇదే దారిలో భారత్‌ కూడా వెళ్లింది. దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ చేస్తున్నట్లు ఆది, సోమవారాల్లో తెలిపాయి. ఇది స్టాక్‌ మార్కెట్లపై పెను ప్రభావం చూపింది. ఈరోజు నష్టాలతో ట్రేడింగ్ మొదలైంది. కొద్ది సేపటికే బీఎస్‌ఈ సెన్సెక్స్ 2,000కు పైగా పాయింట్లు నష్టపోయింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు 4000 పాయింట్లు పతనమైంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సూచీలు అగాధంలోకి జారుకున్నాయి. దాదాపు 13.29 శాతం ముదుపర్ల సంపద హరించుకుపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ అతి తక్కువగా 25,939.60 పాయింట్లను తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీలు కూడా భారీగా పతనమయ్యాయి. దాదాపు 1145.90 పాయింట్లు లేదా 13.03 శాతానికి దిగజారింది. ప్రస్తుతం నిఫ్టి 7,605.85 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా బ్యాకింగ్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. అత్యధికంగా యాక్సిస్ బ్యాంక్ షేర్లు 28.86 శాతం పతనమయ్యాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు దాదాపు 17.2 శాతం నష్టాలను చవిచూశాయి.

Tags : corona effect on stock market, sensex, nifty , stock market points today, corona effect on business

Tags:    

Similar News