గుడ్‌న్యూస్.. చిన్నారుల వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ విజృంభన, థర్డ్ వేవ్ హెచ్చరికలతో డీసీజీఐ (Drugs Controller General of India) మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2 నుంచి 18 సంవత్సరాల (age group) మధ్య వారికి కోవాక్జిన్ (కొవిడ్ -19 వ్యాక్సిన్) క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. 2,3 దశల్లో ట్రయల్స్ నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా 525 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లకు భారత్ బయోటెక్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు హైదరాబాద్ కేంద్రంగా […]

Update: 2021-05-13 00:12 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ విజృంభన, థర్డ్ వేవ్ హెచ్చరికలతో డీసీజీఐ (Drugs Controller General of India) మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2 నుంచి 18 సంవత్సరాల (age group) మధ్య వారికి కోవాక్జిన్ (కొవిడ్ -19 వ్యాక్సిన్) క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. 2,3 దశల్లో ట్రయల్స్ నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా 525 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లకు భారత్ బయోటెక్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ తెలిపింది. నిపుణుల కమిటీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్లినికల్ ట్రయల్స్ ఢిల్లీ ఎయిమ్స్, పాట్నా ఎయిమ్స్‌, నాగ్‌పూర్‌లోని మెడిట్రినా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో జరుగుతాయని వెల్లడించింది.

Tags:    

Similar News