రేపటినుంచి బతుకమ్మ చీరల పంపిణీ

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన కోటి మంది మహిళలకు రేపటినుంచి అక్టోబర్ 11వ తేదీ వరకూ పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 287 డిజైన్లలో మగ్గాలపై నేసిన చీరలు ఇప్పటికే 33జిల్లాలకు చేరాయి. ప్రభుత్వం చీరల తయారీకి దాదాపు రూ.319 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న సమయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులే ఇంటింటికీ వెళ్లి చీరలను […]

Update: 2020-10-08 04:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన కోటి మంది మహిళలకు రేపటినుంచి అక్టోబర్ 11వ తేదీ వరకూ పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 287 డిజైన్లలో మగ్గాలపై నేసిన చీరలు ఇప్పటికే 33జిల్లాలకు చేరాయి. ప్రభుత్వం చీరల తయారీకి దాదాపు రూ.319 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న సమయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులే ఇంటింటికీ వెళ్లి చీరలను అందజేయనున్నారు. అప్పుడు తీసుకోని వారికి 12వ తేదీ నుంచి 15వ తేదీవరకూ స్థానిక రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయనున్నారు.

Tags:    

Similar News