NTR యుగపురుషుడు : బాలకృష్ణ

దిశ, వెబ్‌డెస్క్ : స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా నటుడు బాలకృష్ణ NTR ఘాట్ వద్ద ఆయన సమాధికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీయార్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ధీరుడు అని కొనియాడారు. ఆయన ఒక యుగపురుషుడని, సాధారణ రైతు కుటుంబంలో పుట్టి విశ్వనటుడిగా ఎదిగారని కితాబిచ్చారు. నీతి, నిజాయితీతో బతికారని, ప్రపంచంలో ఎవరూ చేయలేని పాత్రలు ఎన్టీఆర్ చేశారన్నారు. ఆ క్రమంలోనే ప్రజలకు ఏదైనా సేవ […]

Update: 2021-01-18 00:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ : స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా నటుడు బాలకృష్ణ NTR ఘాట్ వద్ద ఆయన సమాధికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీయార్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ధీరుడు అని కొనియాడారు.

ఆయన ఒక యుగపురుషుడని, సాధారణ రైతు కుటుంబంలో పుట్టి విశ్వనటుడిగా ఎదిగారని కితాబిచ్చారు. నీతి, నిజాయితీతో బతికారని, ప్రపంచంలో ఎవరూ చేయలేని పాత్రలు ఎన్టీఆర్ చేశారన్నారు. ఆ క్రమంలోనే ప్రజలకు ఏదైనా సేవ చేయాలని పార్టీ స్థాపించారని.. పేద ప్రజల జీవితాల్లో వెలుగును ఎన్టీఆర్ నింపారని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News