శానిటైజ్ చేసిన బౌలర్‌పై వేటు

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ ససెక్స్ (English County Club Sussex) తరపున ఆడుతున్న ఆస్ట్రేలియన్ సీనియర్ బౌలర్ మిచ్ క్లేడన్‌పై వేటు వేశారు. బాబ్ విల్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో మిచ్ బంతిపై శానిటైజర్ పూసి మెరుపు రప్పించడానికి ప్రయత్నించాడు. కోవిడ్ అనంతరం ఐసీసీ తాత్కాలికంగా బంతిపై ఉమ్మిని రుద్దడాన్ని నిషేధించింది. దీంతో మిచ్ శానిటైజర్ (Sanitizer) పూశాడు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ససెక్స్ యాజమాన్యం ఈసీబీ (ECB)ని సంప్రదించింది. బోర్డు […]

Update: 2020-09-07 10:53 GMT

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ ససెక్స్ (English County Club Sussex) తరపున ఆడుతున్న ఆస్ట్రేలియన్ సీనియర్ బౌలర్ మిచ్ క్లేడన్‌పై వేటు వేశారు. బాబ్ విల్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో మిచ్ బంతిపై శానిటైజర్ పూసి మెరుపు రప్పించడానికి ప్రయత్నించాడు. కోవిడ్ అనంతరం ఐసీసీ తాత్కాలికంగా బంతిపై ఉమ్మిని రుద్దడాన్ని నిషేధించింది. దీంతో మిచ్ శానిటైజర్ (Sanitizer) పూశాడు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ససెక్స్ యాజమాన్యం ఈసీబీ (ECB)ని సంప్రదించింది. బోర్డు నిబంధనల మేరకు అతడిని సర్రేతో జరగాల్సిన తర్వాతి మ్యాచ్ నుంచి తప్పించారు. ఈ మేరకు ససెక్స్ కౌంటీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా, శానిటైజర్ పూసిన మ్యాచ్‌లో మిచ్ క్లేడన్ మూడు వికెట్లు తీయడం గమనార్హం. ఆస్ట్రేలియాకు చెందిన ఈ బౌలర్ ఇప్పటి వరకు 112 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 110 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 147 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.

Tags:    

Similar News