తగ్గిన టోకు ఆహార ద్రవ్యోల్బణం!

దిశ, వెబ్‌డెస్క్: 2020 ఏప్రిల్‌లో టోకు ఆహార ధరల ద్రవ్యోల్బణం 3.6 శాతంగా నమోదైంది. అంతకుముందు మార్చిలో 5.49 శాతంగా ఉన్నట్టు కేంద్ర గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటం వల్ల డేటా సేకరణ జరగలేదని, ఏప్రిల్‌లో టోకు ధరల సూచిక(డబ్ల్యూపీఐ) ఓవరాల్ ప్రొవిజనల్ గణాంకాలు విడుదల చేయలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి వల్ల ఏప్రిల్‌లో హోల్‌సేల్ మార్కెట్లో ఉత్పత్తుల పరిమిత లావాదేవీలు జరిగాయి. ఎంచుకున్న కర్మాగారాలు, సంస్థాగత […]

Update: 2020-05-14 09:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2020 ఏప్రిల్‌లో టోకు ఆహార ధరల ద్రవ్యోల్బణం 3.6 శాతంగా నమోదైంది. అంతకుముందు మార్చిలో 5.49 శాతంగా ఉన్నట్టు కేంద్ర గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటం వల్ల డేటా సేకరణ జరగలేదని, ఏప్రిల్‌లో టోకు ధరల సూచిక(డబ్ల్యూపీఐ) ఓవరాల్ ప్రొవిజనల్ గణాంకాలు విడుదల చేయలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి వల్ల ఏప్రిల్‌లో హోల్‌సేల్ మార్కెట్లో ఉత్పత్తుల పరిమిత లావాదేవీలు జరిగాయి. ఎంచుకున్న కర్మాగారాలు, సంస్థాగత వనరుల నుంచి ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా డేటా సేకరించబడింది. దీంతో ఎంపిక చేసిన డబ్ల్యూపీఐ గ్రూప్ ధరలను మాత్రమే విడుదల చేశామని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Tags:    

Similar News