ఎన్ని కేసులైనా చికిత్స అందిస్తాం : సీఎం జగన్

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులపై సీఎం జగన్ స్పందించారు. ఎన్ని కేసులు నమోదైనా ప్రతిఒక్కరికీ వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని కిందిస్థాయి నుంచి ప్రతీ అధికారి సీరియస్‌గా తీసుకున్నారని సీఎం అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో క్యాంపు కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భయపడి టెస్టులు చేయడం మాత్రం […]

Update: 2020-07-28 04:27 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులపై సీఎం జగన్ స్పందించారు. ఎన్ని కేసులు నమోదైనా ప్రతిఒక్కరికీ వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని కిందిస్థాయి నుంచి ప్రతీ అధికారి సీరియస్‌గా తీసుకున్నారని సీఎం అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో క్యాంపు కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భయపడి టెస్టులు చేయడం మాత్రం తగ్గించబోమన్నారు. అంతేకాకుండా కరోనా రిపోర్టుల వెల్లడి కూడా పారదర్శకంగా చేస్తున్నామని వివరించారు.రానున్న రోజుల్లో వైరస్ కట్టడికి పకడ్బందీ ప్లాన్ సిద్ధం చేయాలని జిల్లా పాలనాధికారులకు, పోలీసు యంత్రానికి సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News