మమ్మల్ని జైలుకు పంపుతారా..? రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ వాదన

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాప్రయోజనంమమ్మల్ని జైలుకు పంపుతారా కోసం చేసే పనులకు జైలుకు పంపుతారా? అని ఏపీ తరపు న్యాయవాది చెన్నై ఎన్జీటీ ముందు వాదించారు. రాయలసీమ ఎత్తిపోతలపై చెన్నై ఎన్జీటీలో గురువారం విచారణ జరిగింది. జస్టిస్ కె.రామకృష్ణన్, కె.సత్యగోపాల్‌తో కూడిన బెంచ్ ముందు సుదీర్ఘ వాదనలు వినిపించారు. కోర్టు ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా? లేదా? అనే అంశంపై ఏపీ వాదనలు ముగిశాయి. ఏపీ వాదనలపై వచ్చే మంగళవారం పిటిషనర్ గవినోళ్ల శ్రీనివాస్ […]

Update: 2021-09-16 09:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాప్రయోజనంమమ్మల్ని జైలుకు పంపుతారా కోసం చేసే పనులకు జైలుకు పంపుతారా? అని ఏపీ తరపు న్యాయవాది చెన్నై ఎన్జీటీ ముందు వాదించారు. రాయలసీమ ఎత్తిపోతలపై చెన్నై ఎన్జీటీలో గురువారం విచారణ జరిగింది. జస్టిస్ కె.రామకృష్ణన్, కె.సత్యగోపాల్‌తో కూడిన బెంచ్ ముందు సుదీర్ఘ వాదనలు వినిపించారు. కోర్టు ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా? లేదా? అనే అంశంపై ఏపీ వాదనలు ముగిశాయి. ఏపీ వాదనలపై వచ్చే మంగళవారం పిటిషనర్ గవినోళ్ల శ్రీనివాస్ తరపు న్యాయవాది, తెలంగాణ న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. ప్రజల కోసం చేసే పనులకు మమ్మల్ని జైలుకు పంపుతారా? అని ఏపీ తరపు సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదించారు.

ఇప్పటివరకు చేసిన పనులు పూడ్చివేయమంటారా? అని ఏపీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల కోసం చేసే చర్యలను న్యాయస్థానం అర్థం చేసుకోవాలని ఏపీ చీఫ్ సెక్రటరీని జైలుకు పంపాలని పిటిషన్ కొట్టివేయాని ఏపీ తెలిపింది. కోర్టు ధిక్కార పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అవ్వడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పెడరల్ విధానంలో రాష్ట్రాల మధ్య సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ, అధికారులను జైలుకు పంపాలని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఈ పిటిషన్​ వేయడంపై ఏపీ ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది వెంకటరమణి అభ్యంతరం తెలిపారు. కోర్టు ధిక్కరణపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందని ధర్మాసనానికి తెలంగాణ తెలిపింది.

ఈ సందర్భంగా కోర్టు ఉల్లంఘనలపై ఎన్జీటీకి ఉన్న అధికారాలపై వాదించారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఇప్పటి వరకు చేసినవి డీపీఆర్‌, ఇతర పనుల కోసమేనని ఏపీ తెలిపింది. ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ ప్రభుత్వం ఫొటోలు ఇచ్చిందని ఏపీ వాదనలు చేసింది. తప్పుడు ఫొటోలు పంపిన తెలంగాణపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీ లేవనెత్తిన అంశాలపై ఈనెల 21న పిటిషనర్‌ గవినోళ్ల శ్రీనివాస్‌, తెలంగాణ న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.

Similar News