BREAKING: ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు

సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2024-05-05 12:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ స్థానంలో మరో డీజీపీ నియామకం కోసం ముగ్గురు పేర్లతో కూడిన ప్యానల్‌ను పంపాలని సీఎస్ జవహర్‌ రెడ్డిని ఆదేశించింది. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదంటూ ఈసీ స్పష్టం చేసింది. అయితే, కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి 2018 నుంచి 2019 వరకు డ్రగ్ కంట్రోల్ డీజీగా బాధ్యతలు నిర్వహించారు. 2019 నుంచి 2020 వరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా పని చేశారు. అనంతరం 2020, ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్ డీజీపీగా నియమితులయ్యారు.

కాగా, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు అందాయి. అధికార పార్టీకి ఆయన అండదండలు ఉన్నాయని, అకారణంగా టీడీపీ నాయకులపై కేసు పెడుతున్నారంటూ టీడీపీ ఇది వరకే ఈసీకి ఫిర్యాదు చేసింది. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సైతం అందజేసింది. తాజాగా ఐదు రోజుల క్రితం టీడీపీ ఫిర్యాదు ఆధారంగా డీజీపీ ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.   

 

Tags:    

Similar News