అంతర్వేది ఆలయ రథం దగ్ధం..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో స్వామివారి రథానికి మంటలు అంటుకోవడంతో అది దగ్ధమైంది. ఆ రథానికి సుమారు 62ఏళ్ల చరిత్ర ఉందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఎవరైనా దుండగులు తగలబెట్టారా లేక షార్ట్ సర్క్యూట్ జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా, రథం కాలిపోవడంపై ఆలయ సిబ్బంది పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

Update: 2020-09-05 21:12 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో స్వామివారి రథానికి మంటలు అంటుకోవడంతో అది దగ్ధమైంది.

ఆ రథానికి సుమారు 62ఏళ్ల చరిత్ర ఉందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఎవరైనా దుండగులు తగలబెట్టారా లేక షార్ట్ సర్క్యూట్ జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా, రథం కాలిపోవడంపై ఆలయ సిబ్బంది పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News