పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి ఘాటు వ్యాఖ్యలు

టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా వేళ వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు...

Update: 2024-02-24 11:56 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా వేళ వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. టీడీపీ నుంచి 94 మంది అభ్యర్థులు ఖరారు కాగా జనసేన నుంచి ఖరారైన 24 మంది అభ్యర్థుల్లో ఐదుగురిని మాత్రమే ప్రకటించారు. దీంతో మంత్రి అంబటి తీవ్రంగా విమర్శలు చేశారు. పల్లకి మోసి పరువు తీసుకోవడం కంటే విలీనం చేసి చిరంజీవిలాగా సినిమాలు తీసుకోవడం మంచిదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని విమర్శించారు. పొత్తుపై తెలుగుదేశం, జనసేనకు స్పష్టత లేదన్నారు. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తులో ఉందో లేదో ఎవరికీ తెలియదన్నారు. జనసేనకు 60 నుంచి 70 సీట్లు ఇస్తారని జనసైనికులు అనుకున్నారని తెలిపారు. 24 సీట్లు తీసుకుని 40 సీట్లలో పోటీ అంటున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ లెక్క చూస్తుంటే తిక్క లెక్కగా కనిపిస్తోందని విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ ఎక్కడ పోటీ చేస్తున్నారో ప్రకటించారని, 24 సీట్లు తీసుకున్న పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదన్నారు. చంద్రబాబు, పవన్ ముఖాల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు.

Read More..

టీడీపీలో చిచ్చు రేపిన తొలి జాబితా.. పెనుగొండలో తీవ్ర వ్యతిరేకత  

Tags:    

Similar News