drunker slapped constable: నడిరోడ్డుపై కానిస్టేబుల్‌ను కొట్టిన మందుబాబు.. వీడియో వైరల్

మద్యం మత్తులో యువకుడు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు.

Update: 2024-05-19 07:29 GMT

దిశ వెబ్ డెస్క్: మద్యం మత్తులో యువకుడు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. నడిరోడ్డుపై కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్నారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. విశాఖపట్నంలోని ఎన్‌ఎడి జంక్షన్‌లో ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురు యువకులని పోలీసులు పట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో వారిలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పరారీ అయ్యారు. మరో వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో పోలీసులకు యువకుడికి మద్య మాటామాటా పెరింగింది. దీనితో ఆ పోలీసు చొక్కాను యువకుడు పట్టుకున్నాడు. తన కాలర్ పట్టుకోవడంతో ఆగ్రహించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఆ యువకుడిని కొట్టాడు. దీనితో రెచ్చిపోయిన యువకుడు తిరిగి ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కొట్టాడు.

ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీసులు ఆ యువకుడిని పట్టుకుని పోలీస్‌ స్టేషన్ తీసుకు వెళ్లారు. కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నందుకు యువకుడిపై కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Click Here For Twitter Post..

Similar News