Konaseema: ఇరిగేషన్‌లో కామంధుడు.. యువతుల నగ్న వీడియోలు తీసి..

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో దారుణం జరిగింది. యువతుల పట్ల ఇరిగేషన్ శాఖ ఉద్యోగి అసభ్యంగా వ్యవహరించారు. ..

Update: 2022-11-24 12:04 GMT

దిశ వెబ్ డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో దారుణం జరిగింది. యువతుల పట్ల ఇరిగేషన్ శాఖ ఉద్యోగి అసభ్యంగా వ్యవహరించారు. క్వార్టర్స్‌లో యువతులు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీశారు. సెల్ ఫోన్ పెట్టి ప్లాన్ ప్రకారం వీడియో రికార్డు చేశారు. రూమ్‌లో సెల్ ఫోన్ కనిపించడంతో యువతులు షాక్‌కు గురయ్యారు. దీంతో ఇరిగేషన్ ఉద్యోగికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యలు చేపడుతున్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో యువతల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కీచకుడిని విధుల నుంచి కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. 

Similar News