Visakha: ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. జగన్ సర్కార్‌పై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

టీడీపీ హాయాంలో పవర్ ప్రాజెక్ట్స్ ఒప్పందం చేసుకుంటే ఆ ప్రాజెక్టును సీఎం జగన్ క్యాన్సిల్ చేశారని విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు గండి బాబ్జి అన్నారు...

Update: 2023-05-22 13:00 GMT

దిశ, ఉత్తరాంధ్ర: టీడీపీ హాయాంలో పవర్ ప్రాజెక్ట్స్ ఒప్పందం చేసుకుంటే ఆ ప్రాజెక్టును సీఎం జగన్ క్యాన్సిల్ చేశారని విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు గండి బాబ్జి అన్నారు. అందుకే ఏపీలో కరెంట్ కొరత ఉందని తెలిపారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాత్రులు కరెంట్ తీసేసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో కరెంట్‌పై లెక్కకుమించి అప్పులు చేశారని చెప్పారు. అన్ని రంగాల్లో అడ్డు అదుపు లేకుండా చార్జీలు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సబ్సిడీ ఇవ్వకుండా దోచేస్తున్నారని, మద్యంపై దోపీడి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదని తెలిపారు. టిడ్కో ఇళ్ళు కూడా నిజమైన లబ్దిదారులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గండి బాబ్జీ హెచ్చరించారు. 

Tags:    

Similar News