మహిళలకు రక్షణ కవచంగా Disha App

మహిళలకు రక్షణ కవచంగా దిశ యాప్ సేవలందిస్తుండడం శుభ పరిణామమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. జాతీయ స్థాయి మహిళా సదస్సు చివరి రోజు కార్యాక్రమంలో ఆయన పాల్గొన్నారు...

Update: 2023-02-06 17:15 GMT

దిశ, ఉత్తరాంధ్ర: మహిళలకు రక్షణ కవచంగా దిశ యాప్ సేవలందిస్తుండడం శుభ పరిణామమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. జాతీయ స్థాయి మహిళా సదస్సు చివరి రోజు కార్యాక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏపీ పోలీస్ దిశ యాప్, ఎస్‌ఓ‌ఎస్ బటన్ పని తీరు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులు ఏర్పాటు చేసిన దిశ స్టా‌ని సందర్శించి ప్రసంశించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దిశ యాప్‌ను మహిళలందరూ తమ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ దిశ యాప్ వల్ల అఘాయిత్యాలను అరికట్టవచ్చని వెంకయ్య పేర్కొన్నారు.

ఇదే కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ చైర్మన్ రేఖా శర్మతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన మహిళా ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిశ యాప్ ప్రాముఖ్యత, ఎస్‌వై‌ఎస్ బటన్ పని తీరు పట్ల మహిళలకు ఉన్న భరోసాపై వీడియో ద్వారా ఏపీ మంత్రి ఉషాశ్రీ చరణ్ వివరించారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి దిశా యాప్‌లో సాధించిన విజయాలను వివరించారు.

షి ఈజ్ ఏ చేంజ్ మేకర్ ప్రాజెక్ట్‌లో భాగంగా 11 రాష్ట్రాలు 50 మంది మహిళ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరు కాగా విశాఖ జాతీయ మహిళా కమిషన్ ఈ కార్యక్రమం నిర్వహించింది. విశాఖపట్నం సిటీ పోలీసులు ఏర్పాటు చేసిన దిశ స్టాల్ మహిళా ప్రతినిధులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దిశ యాప్ అత్యంత స్వల్ప వ్యవధిలో 1,11,39,456 మంది తమ సెల్ ఫోన్ నెంబర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ప్రశంసించదగ్గ విషయం అని వక్తలు కొనియాడారు

Similar News