అభ్యర్థిని బెదిరించిన సీఐ సస్పెండ్..ఎక్కడంటే?

విశాఖ పోలీసు కమిషనరేట్ పరిధిలో మార్కాపురం సీఐ ఎస్ సన్యాసి నాయుడుని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది.

Update: 2024-04-29 08:38 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: విశాఖ పోలీసు కమిషనరేట్ పరిధిలో మార్కాపురం సీఐ ఎస్ సన్యాసి నాయుడుని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోయలాడ వేంకటేశ్వర జగదీష్ అనే రౌడీ షీటర్ పట్ల సీఐ అనుచితంగా ప్రవర్తించినట్టు అభియోగం రావడంతో సస్పెండ్ చేశారు. నామినేషన్ ను వెనక్కి తీసుకోవాలని చిత్ర హింసలు పెట్టినట్టు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందింది. విచారణ అనంతరం సీఐ ని సస్పెండ్ చేయాలని స్థానిక అధికారులను ఎన్నికల కమిషన్ పరిశీలకులు అదేశించారు.

Similar News