వర్షం ఎఫెక్ట్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగేనా..?

ఏపీలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది...

Update: 2024-05-12 10:49 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అయితే రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు పలు చోట్ల వర్షం కురుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో భారీగా వర్షం కురుస్తోంది. పాడేరులో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.


దీంతో ఆ నియోజకవర్గం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షం వల్ల ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదోనని టెన్షన్ పడుతున్నారు. ఒక వేళ భారీ వర్షం వల్ల ఓటు హక్కు నమోదు చేసుకోలేమోనని ఆందోళన చెందుతున్నారు. అటు అధికారులు మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 

Similar News