నేడు ఢిల్లీకి పవన్ కల్యాన్, చంద్రబాబు.. హోంమంత్రి అమిత్‌షాతో భేటి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి జనసేనాని నాయకత్వంలో టీడీపీ, బీజేపీ పొత్తు పై మంతనాలు జరుపుతున్నాయి.

Update: 2024-03-07 04:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి జనసేనాని నాయకత్వంలో టీడీపీ, బీజేపీ పొత్తు పై మంతనాలు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, ముఖ్య నాయకులతో కలిసి.. అమిత్ షా, నడ్డాలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఈ క్రమంలో నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ రోజు ఢిల్లీ వెళ్తుండటంతో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పొత్తులపై క్లారిటీ వస్తే.. రెండు రోజుల్లో మూడు పార్టీలు కలిసి మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే టీడీపీ, జనసేన కలిపి మొత్తం 99 మంది అభ్యర్థులను ప్రకటించగా మరో 25 మందిని జనసేన ప్రకటించాల్సి ఉంది.

Read More..

వైసీపీ మేనిఫెస్టోను ప్రజలు విశ్వసిస్తారా?  

Tags:    

Similar News