Ap Politics:అందుకే నేను పవన్ కళ్యాణ్ కు డై హార్ట్ ఫ్యాన్:జబర్దస్త్ నటుడు

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం తక్కువ ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది.

Update: 2024-04-19 08:51 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం తక్కువ ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున జబర్దస్త్ నటుడు హైపర్ ఆది ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. అందుకే ఆయన వెంట మేము ఉంటామని హైపర్ ఆది అన్నారు.

ఎటువంటి అధికారం లేకపోయినా ప్రభుత్వాలు చేయాల్సినఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం తక్కువ ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది.పనిని పవన్ చేస్తున్నారన్నారు. విశాఖలో బోట్లు తగలబడినప్పుడు మత్స్యకారులను పవన్ ఆదుకున్నారని, కౌలు రైతులను ఆదుకునే విషయంలో పవన్ చూపించిన చొరవ తనకు బాగా నచ్చిందని చెప్పారు. ఈ క్రమంలోనే నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అని అందుకే పవన్ కళ్యాణ్ ఆయనకు సీటు ఇచ్చారని పేర్కొన్నారు. అనకాపల్లిలో గడిచిన రెండు రోజుల ప్రచారంలో జనసేనకు విశేష స్పందన లభించిందన్నారు. జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Similar News