టికెట్ నిరాకరించిన బాబు.. కంటతడి పెట్టుకున్న TDP మాజీ ఎమ్మెల్యే

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ

Update: 2024-03-28 07:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురై ఆయన కార్యకర్తల సమక్షంలోనే కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా కుటుంబాన్ని ఫణంగా పెట్టి టీడీపీ కోసం కృషి చేశానని తెలిపారు. అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే ప్రజల్లోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. నాతో పాటు కుటుంబ సభ్యులు కూడా వస్తారన్నారు. రేపు నియోజకవర్గ పరిధిలోని మహేంద్రవాడ నుండి పర్యటన ప్రారంభిస్తానని ప్రకటించారు. ఐదు రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకుంటానని తేల్చి చెప్పారు. కార్యకర్తలు విరాళాలు ఇవ్వడం జీవితంలో మర్చిపోలేనని అన్నారు.

ఇదిలా ఉండగా.. అనపర్తి మండలం రామవరంలో ఇవాళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి ఇంటికి ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. నల్లమిల్లికి అనపర్తి టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై.. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను తగలబెట్టారు. నల్లమిల్లికి రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేశారు. ఇద్దరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. మరో కార్యకర్త బిల్డింగ్ పై నుండి దూకేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన తోటి కార్యకర్తలు వారికి నచ్చజెప్పారు. కాగా, జనసేన, బీజేపీలతో పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ సీటును టీడీపీ బీజేపీకి ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News