పైకి పైపులు... లోపల కోట్లు.. పోలీసుల ముందే పుష్ప తెలివితేటలు

ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రలోభాల పర్వం జోరందుకుంది. ...

Update: 2024-05-09 02:21 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రలోభాల పర్వం జోరందుకుంది. ఓటర్లను కొనుగోలు చేసేందుకు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నగదు, బంగారం, వెండి, మద్యం, చీరలు, గిఫ్టులు ఇన్ని ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా భారీగా నగదును తరలిస్తున్నారు. అయితే కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేస్తోంది. ప్రలోభాలను ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తోంది. ఇప్పటి వరకూ వందల కోట్లు డబ్బులు, భారీగా మద్యం, చీరలు, గిప్టులు, ఇతర సామాగ్రిని గుర్తించి సీజ్ చేసింది.

తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదును ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. గరికపాడు చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పైపుల లారీలో తరలిస్తున్న రూ. 8 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. సరైన అధారాలు లేకపోవడంతో సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లారీ ఎవరిదీ.. ఎవరికి, ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Similar News