రెండో రోజుకి పెరిగిన CM జగన్ బ్యాండేజ్ సైజ్.. చివరికి ఇలా అవుతాడంటూ TDP సెటైర్
ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ల జోరు నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ-వైసీపీ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ల జోరు నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ-వైసీపీ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విజయవాడ సిద్ధం సభలో సీఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి జగన్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం అయ్యింది. ఈ దాడిపై పలువురు రాయకీయ నాయకులు స్పందించి.. సింపతీ చూపించగా.. టీడీపీ నేతలు దారుణంగా కామెంట్లు చేశారు. తాజాగా టీడీపీ పార్టీ నాయకుడు ఒకరు సింపతీ రెడ్డి అని క్యాప్షన్ జోడించి జగన్‌కు సంబంధించిన ఓ మీమ్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ మీమ్‌లో జగన్ మొదటి రోజు చిన్న బ్యాండేజ్‌తో కనిపించగా, రెండో ఆ బ్యాండెజ్ సైడ్ కాస్త పెరిగింది. ప్రచారం చివరి రోజు వరకు జగన్ బాడీ మొత్తం బ్యాండేజ్‌తో కనిపిస్తున్నట్లు ఉంది. ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. జగన్‌పై సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.