చంద్రబాబు బ్లాక్ కమెండో సెక్యూరిటీపై.. తమ్మినేని సంచలన కామెంట్స్

టీడీపీ, వైసీపీ మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్లు జోరుగా సాగుతున్నాయి. చంద్రబాబు భద్రతపై వైసీపీ నేతలు సంచలన కామెంట్స్ చేస్తున్నారు.

Update: 2023-05-30 03:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ, వైసీపీ మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్లు జోరుగా సాగుతున్నాయి. చంద్రబాబు భద్రతపై వైసీపీ నేతలు సంచలన కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా.. స్పీకర్ తమ్మినేని కూడా చంద్రబాబు భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం లేకపోతే చంద్రబాబు విలవిల కొట్టుకుంటాడని వ్యాఖ్యానించారు. ఎవరిని ఉద్ధరించటానికి బాబుకు బ్లాక్ కమాండోస్ ఇచ్చారని ప్రశ్నించారు. దేశంలో ఎంతోమందికి బెదిరింపులు ఉన్నాయని.. చంద్రబాబు ఏమైనా వ్యవస్థలకు అతీతుడా అని వ్యాఖ్యానించారు. జడ్‌ ప్లస్ కేటగిరి భద్రత పొందే అర్హత బాబుకు ఉందా.. దేశంలో థ్రెట్ ఉన్న వాళ్లందరికి జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారా అని ప్రశ్నించారు. అధికారం లేకపోతే బాబు విలవిలలాడుతారని తమ్మినేని అన్నారు.

Tags:    

Similar News