షర్మిలకు 82.58 కోట్ల రూపాయల అప్పు ఇచ్చిన సీఎం జగన్

ఏపీ ఎన్నికల వేళ సీఎం జగన్, షర్మిల అప్పుల అంశం తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు.

Update: 2024-04-20 10:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికల వేళ సీఎం జగన్, షర్మిల అప్పుల అంశం తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఈ క్రమంలోనే తన అన్న జగన్ పై, ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆమె.. తన అఫిడవిట్‌లో అస్తుల విులు 182.82 కోట్లు అని అందులో 123.26 కోట్లు చరాస్తుల అని, 9.29 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయని ప్రకటించింది. అలాగే తన అన్న జగన్ వద్ద రూ. 82. 58 కోట్లు, వదిన వైఎస్ భారతి రెడ్డి వద్ద రూ. 19.56 కోట్లు అప్పులు తీసుకున్నట్లు చూపించింది. దీంతో సీఎం జగన్ తో తనకు ఎటువుంటి సంబంధం లేదని చెప్పుకునే షర్మిలకు సీఎం జగన్ ఎందుకు డబ్బులు ఇచ్చాడని.. అంత మొత్తంలో జగన్ వద్ద డబ్బులు ఎక్కడివి అని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు.

Read More..

పవన్ కల్యాణ్‌పై పోతిన మహేశ్ మరోసారి హాట్ కామెంట్స్  

Tags:    

Similar News