Alert: నేడు 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. ఆ జిల్లాలో అత్యధిక ఉష్టోగ్రత నమోదు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.

Update: 2024-04-30 05:20 GMT

దిశ వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 9 గంటలు దాటింది అంటే ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భానుడు బగ్గుమంటున్నాడు. నిన్న ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఇక ఈరోజు 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 173 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

ప్రస్తుతం ఉన్న ఎండ తీవ్రతనే తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అయుతే వచ్చే నెల మూడవ తేదీ నుండి ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగి అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అలానే రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అవసరం ఉంటే తప్ప ఉదయం తొమ్మిది గంటల తర్వాత బయటకు రావద్దని హెచ్చరించింది. 

Similar News