శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం అభిషేకం సేవలో మరియు నైవేద్య విరామ సమయంలో పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు.

Update: 2024-05-17 12:28 GMT

దిశ,తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం అభిషేకం సేవలో మరియు నైవేద్య విరామ సమయంలో పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్వన ఏర్పాట్లు చేశారు. వీరిలో తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే రఘురామరాజు , తెలంగాణ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవులు, ఏపీసీసీఎఫ్ శాంతి ప్రియ పాండే, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి, ఎమ్మెల్యే వరప్రసాద్, విశాఖపట్నం ఎమ్మెల్యే గణబాబులు కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా స్వామివారికి మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదించగా ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Similar News