Cm Jagan: బాలినేనికి పిలుపు.. తాడేపల్లిలో భేటీకి నిర్ణయం

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌కు సీఎం జగన్ నుంచి పిలుపు అందింది...

Update: 2023-05-31 10:39 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌కు సీఎం జగన్ నుంచి పిలుపు వెళ్లింది. గురువారం తాడేపల్లికి రావాలని బాలినేనిని సీఎం జగన్ ఆహ్వానించారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలపై బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకు ప్రాధాన్యత తగ్గించారని ఆయన ఆవేదన చెందుతున్నారు. అధిష్టానం తనకు ఇచ్చిన రీజనల్ కో-ఆర్డినేటర్ పదవిని కూడా ఆయన వదులుకున్నారు. అనంతరం పార్టీ కార్యక్రమాలకు కూడా  అందుబాటులో ఉండటం లేదు. దీంతో సీఎం జగన్ దృష్టి సారించింది. బాలినేనిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుభాగంగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌ కార్యాలయంలో వీరి భేటీ జరగనుంది.  ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  దీంతో ఏం జరుగుతుందోనని బాలినేని వర్గీయుల్లో ఉత్కంఠ నెలకొంది. 

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి,  టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీ కార్యక్రమాలు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నిర్వహిస్తున్నారు. ఇక పార్టీ ఫ్లెక్సీల్లో కూడా వర్గ పోరు తారా స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఒకరి ప్లెక్సీలో మరొకరి ఫొటో అసలు నచ్చదు. వెంటనే చించివేతలు జరుగతాయి. ఈ విషయం సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో బాలినేని శ్రీనివాసరెడ్డికి నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై బాలినేని శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. సీఎం జగన్‌కు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి స్వయంగా బంధువులే కావడం విశేషం. 

Tags:    

Similar News