అవినీతి కోసమే పోలవరం ఆలస్యం చేస్తున్నారు: కేంద్ర మంత్రి అమిత్ షా..

2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జనసేన, టీడీపీ బీజేపీ పార్టీ తో పొత్తు పెట్టుకున్నాయి.

Update: 2024-05-05 07:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జనసేన, టీడీపీ బీజేపీ పార్టీ తో పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులో భాగంగా ఏర్పాటు చేసిన ఉమ్మడి సమావేశంలో ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాషను నిర్వీర్యం చేసేందుకు ప్రాథమిక విద్యలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టిందని.. తాము ఉండగా.. తెలుగు భాషను అంతం కానీయ్యబోమని అమిత్ షా తేల్చి చెప్పారు.

అలాగే రాష్ట్రంలో పెట్రేగిపోతున్న గుండాగిరీ, అవినీతిని అంతం చేయడానికి పొత్తు పెట్టుకున్నామని.. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న ల్యాండ్ మాఫీయాలను అంతం చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా చేయడానికి పొత్తు పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అవినీతి కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం చేస్తుందని.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాబోయే రెండేళ్లలో పోలవరం పూర్తి చేసి చూసిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలుపు కోసం, దేశంలో మరోసారి ప్రధాని మోడీ విజయం కోసం బీజేపీ కి ఓటు వేసి గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు.

Similar News