YS Sharmila: వివేకా హత్యపై సుప్రీం స్టే.. స్పందించిన వైఎస్ షర్మిల.. ఎమన్నారంటే..?

ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి ప్రస్తావించకూడదని కడప కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ షర్మిల సుప్రీంకోర్టులో పిటీషన్ ధాఖలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-05-18 10:04 GMT

దిశ వెబ్ డెస్క్: ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి ప్రస్తావించకూడదని కడప కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ షర్మిల సుప్రీంకోర్టులో పిటీషన్ ధాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా వైఎస్ షర్మిల ధాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ చేసిన సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి విషయంలో సుప్రీంకోర్టు స్టే విధించడంపై వైఎస్ షర్మిల వేదికగా స్పందించింది.

దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా, వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని పేర్కొన్నారు. భావప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షసమూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి, ఎప్పటికైనా ధర్మపోరాటంలో చివరికి న్యాయమే గెలుస్తుందనే విషయం నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే నిరూపింస్తోందని వెల్లడించారు. అధికార బలాన్ని ఉపయోగించి, మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసేవారికి ఈ స్టే చెంపపెట్టు అని ఆమె అన్న, ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ విజయం తన తొలి అడుగు మాత్రమేనని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో, వివేకకానంద రెడ్డి కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చిట్టచివరిగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Similar News