ఆ పనులు నేను సినిమాల్లోనే చేయను.. ఇక ఇక్కడెందుకు చేస్తా: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వారాహి యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు గ్రామంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు.

Update: 2023-06-15 11:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వారాహి యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు గ్రామంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు తనను తిట్టినా పట్టించుకోనని.. రాజకీయం కంటే తనకు రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని అన్నారు. ఒక్క అవకాశం ఇస్తే మాటలు చెప్పకుండా.. చేతల్లో చూపిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని విమర్శించారు. తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం వంటిని తాను సినిమాల్లోనే చేయనని.. అలాంటిది ప్రజల్లో ఉన్నప్పుడు ఎందుకు చేస్తానని అన్నారు. వైసీపీ సర్కార్‌కు దమ్ముంటే ప్రజల సమస్యలు పరిష్కరించాలని సవాల్ చేశారు. నాలుగేళ్లుగా రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా జగన్‌ మిగిలిపోతాడని ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి:

YCP: పవన్ వారాహి తొలి రోజు టూర్ అట్టర్ ఫ్లాప్..!  

Similar News