హనుమాన్ జయంతి రోజున భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరిన పవన్ కల్యాణ్ (వీడియో)

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ సారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-04-23 05:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ సారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పవన్ పిఠాపురంలో ఇల్లు సైతం తీసుకున్నారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉండి దేశం మొత్తం తమ వైపు చూసేలా చేస్తానని ఇటీవల హామీ ఇచ్చారు. అయితే, తాను నమ్మే అంజనేయ స్వామి సెంటిమెంట్ కలిసొచ్చేలా హనుమాన్ జయంతి రోజున పిఠాపురం శాసనసభ అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్ వేసేందుకు బయలుదేరి వెళ్లారు. జనసేనాని కారులో నుంచి అభివాదం చేస్తుండగా భారీగా తరలివచ్చిన జనసేన శ్రేణులు, ఫ్యాన్స్ ఆయన వెంట బైక్ ర్యాలీగా వెళ్లారు. జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ ర్యాలీ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోకు భీమ్లా నాయక్ మ్యూజిక్‌తో వచ్చే జనసేన పార్టీ పాటను మిక్స్ చేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నామినేషన్ ర్యాలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Tags:    

Similar News