Pawan Kalyan: మైండ్ గేమ్ పాలిటిక్స్‌పై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) మైండ్ గేమ్ పాలిటిక్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనల్ని బండబూతులు తిట్టిన వ్యక్తులు అకస్మాత్తుగా

Update: 2022-06-08 13:01 GMT

దిశ, ఏపీ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) మైండ్ గేమ్ పాలిటిక్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనల్ని బండబూతులు తిట్టిన వ్యక్తులు అకస్మాత్తుగా మారిపోయి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారంటే దాని వెనుక మైండ్ గేమ్ దాగి ఉన్నట్లే లెక్క అని దాన్ని గుర్తించాలంటూ ట్విటర్ వేదికగా హిత బోధ చేశారు. 'అప్పటివరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడడం ప్రారంభిస్తారని, అయితే ఆ పొగడ్తలు చూసి ఆ నాయకుడు మారిపోయాడని, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు కొట్టి, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్టే. అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడెందుకు పొగుడుతున్నారో ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి.. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తించండి.. జర భద్రం! అంటూ పవన్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News