AP Politics:ఒకరిది సక్రమ పొత్తు-మరొకరిది అక్రమ పొత్తు:వైఎస్ షర్మిల

టీడీపీ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఎవరికి ఓటేసిన భారతీయ జనతా పార్టీకి వేసినట్టేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు.

Update: 2024-04-29 08:58 GMT

దిశ ప్రతినిధి,కాకినాడ:టీడీపీ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఎవరికి ఓటేసిన భారతీయ జనతా పార్టీకి వేసినట్టేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఒకరు బీజేపీతో సక్రమ పొత్తులో ఉండగా, మరొకరు అక్రమ పొత్తులో ఉన్నారని విమర్శించారు. ఏపీ న్యాయ్ యాత్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడలో సోమవారం పీసీసీ చీఫ్ షర్మిల రోడ్ షోలో పాల్గొన్నారు. షర్మిల రోడ్ షోకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆమె భానుగుడి సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ పదేళ్లలో దేశంలో కానీ,రాష్ట్రంలో కానీ అభివృద్ధి అనేది కానరాలేదన్నారు. మన పిల్లలకు ఉద్యోగాలు లేవని, కార్మికులకు ఉపాధి కరవైందన్నారు. వైసీపీకి ఓటు వేసిన టీడీపీకి ఓటు వేసిన మనకు న్యాయం జరగదని, రెండు పార్టీలు బీజేపీతో పొత్తులో ఉన్నాయన్నారు. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన రావాలంటే హస్తం గుర్తుకే ఓటు వేయాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు త్వరిత గతిన పూర్తి కావాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో విధ్వంసకర పాలన జరుగుతుందని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు.

Read More..

ఎన్నికల గుర్తుల కేటాయింపులో బిగ్ ట్విస్ట్.. టీడీపీ రెబల్ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు 

Similar News