ఎమ్మెల్యేలు చక్రవర్తుల్లా.. ఎంపీపీలు సామంతుల్లా చలామణి అవుతున్నారు: మంత్రి Bosta Satya Narayana సంచలన వ్యాఖ్యలు

ప్రజల సొమ్మును దోచుకుతిన్న వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టకుండా గౌరవించాలా అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Update: 2023-09-29 10:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రజల సొమ్మును దోచుకుతిన్న వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టకుండా గౌరవించాలా అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో శుక్రవారం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకొని బతికారని విమర్శించారు. అయితే స్కిల్ స్కాం కేసులో ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు అని అన్నారు. దోచుకుతిన్న వారు ధర్నాలు చేసినపుడు వదిలిపెడితే అందరూ అదే దారిలో వెళ్తారు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీలో తమ వేదనను చెప్పుకోవడంలో టీడీపీ ఫెయిల్ అయ్యిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మరోవైపు ఓపిఎస్ అమలు చేస్తామని చెప్పినప్పటికీ ..అన్నీ ఆలోచించిన తరువాత చేయలేమని చెప్పాం అని అన్నారు. అందుకే జీపీఎస్‌ను తీసుకువచ్చాం అని చెప్పుకొచ్చారు. దాన్ని అమలు చేస్తామని అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు అవసరాలు ముఖ్యం... ఏ ఒక్క వర్గం మేలుకోసం ప్రభుత్వం పనిచేయదు అని మంత్రి బొత్స తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలోని అంతర్గత సమస్యలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో నాయకుల మధ్య సమన్వయం కొరవడిందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు చక్రవర్తుల మాదిరిగా ఎంపీపీలు సామంతులుగా చలామణి అవుతున్నారని మంత్రి అన్నారు. ఇలాంటి పరిణామాలు భవిష్యత్‌కు మంచిది కాదని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.

ఇవి కూడా చదవండి స్కామ్‌లో రూ.370కోట్లు Chandrababu Naidu కొట్టేశారు: మంత్రి Kakani Govardhan Reddy

Tags:    

Similar News