ఆ ఆరోపణ అవాస్తవం: మంత్రి అంబటి

బీజేపీతో తమకు తెరవెనక సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణ అవాస్తవమని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు...

Update: 2024-04-17 12:38 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నాయి.  ఇప్పటికే ఈ మూడు పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే కేంద్రంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. దీంతో వైసీపీ కూడా బీజేపీ మద్దతు ఇస్తోందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీతో టీడీపీ, జనసేన అధికారికంగా పొత్తు పెట్టుకుంటే వైసీపీ అనాధికారికంగా సపోర్ట్ చేస్తుందని రాజకీయ నాయకులు అంటున్నారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. బీజేపీతో తమకు తెరవెనక సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణ అవాస్తవమన్నారు. తాము ఎవరికీ సపోర్ట్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ స్వతంత్రంగా పోటీ చేసే పార్టీ అని.. ఎవరితో పొత్తు లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరుపుతామని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Similar News