Breaking: డోన్‌లో బ్లేడ్ బ్యాచ్ కలకలం.. విద్యార్థినిపై దాడి

నంద్యాల జిల్లా డోన్‌లో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయింది. ఐదో తరగతి విద్యార్థిపై దాడి చేసింది. ఈ దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ...

Update: 2023-03-06 16:11 GMT

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా డోన్‌లో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయింది. ఐదో తరగతి విద్యార్థిపై దాడి చేసింది. ఈ దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అప్రమత్తమైన పోలీసులు .. ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి విద్యార్థిపై దాడి చేసినట్లు గుర్తించారు. బ్లేడ్ బ్యాచ్‌ను పట్టుకునేందుకు బృందాలుగా గాలిస్తున్నారు. ఇటీవల కాలంలో విజయవాడలో బ్లేడ్ బ్యాచ్‌లు కలకం సృష్టించాయి. రెండు బ్యాచ్‌లు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ ఘటన మరువకముందే నంద్యాలలోనూ కలకలం రేగడం పోలీసులకు సవాల్‌గా మారింది. బ్లేడ్ బ్యాచ్‌లను గుర్తించి కఠిన శిక్షలు తీసుకోవాలని భావిస్తున్నారు. 

Tags:    

Similar News