Sex Rocket: వ్యభిచారం చేస్తూ పట్టుబడిన మహిళా హోంగార్డు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వ్యభిచార గృహంపై చిలకలపూడి పోలీసులు దాడి చేశారు...

Update: 2023-05-27 09:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వ్యభిచార గృహంపై చిలకలపూడి పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ విటుడు విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు పట్టుబడ్డారు. ఇలా పట్టుబడిన మహిళలో ఒక హోంగార్డు ఉండటం సంచలనంగా మారింది. మచిలీపట్నం న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలోనీ ఓ అద్దె ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని చిలకలపూడి పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యభిచార నిర్వహిస్తున్న ఇంటిపై దాడికి దిగారు. ఈ దాడులలో ఇద్దరు మహిళలు వీర కుమారి, హోమ్ గార్డ్ లలిత కుమారి, ఓ విటుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఇద్దరు నిర్వాహకుల్లో ఒకరు మహిళా హోంగార్డు కావడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు మహిళా హోంగార్డుతో పాటు పట్టుబడిన వారందరినీ చిలకలపూడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎస్పీ ఆదేశాలతో దొరికిన వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిలకలపూడి పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News