కడపలో చంద్రబాబుపై భగ్గుమన్న కిరణాషాపు యజమానులు.. క్షమాపణకు డిమాండ్

టీడీపీ అధినేత చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని కడపలో కిరణాషాపు యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు...

Update: 2024-04-06 10:18 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ గంజాయి రవాణా యదేచ్ఛగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా వాటి మూలాలూ ఏపీలోనే కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం, భద్రతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ సర్కార్ చేతులెత్తేయడం వల్ల రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ విరివిగా గంజాయి, డ్రగ్స్‌ లభ్యమవుతోందని రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు. అటు ప్రతిపక్ష నాయకులు సైతం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న ‘ప్రజాగళం’ యాత్రలోనూ గంజాయి, డ్రగ్స్‌పై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఓ కిరణా షాపులో గంజాయి దొరికిన విషయాన్ని గుర్తు చూస్తే సీఎం జగన్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. గంజాయి కోసం ఎంతోదూరం వెళ్లాల్సిన పని లేదని.. కిరణా షాపుల్లోనూ సరసనమైన ధరల్లో లభిస్తుందని ఎద్దేవా చేశారు. దీంతో కడపలో కిరణా షాపు యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కిరణా షాపులు మూసివేసి నిరసన వ్యక్తం చేస్తారు. కిరణా షాపుల్లో సరసమైన ధరల్లో గంజాయి దొరుకుతుందన్న చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టారు. వెంటనే తమకు క్షమాపణ చెప్పాలని కిరణా షాపు యజమానులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

Tags:    

Similar News