Hailstorms: ఏపీకి హెచ్చరిక.. 125 మండలాల్లో వడగాల్పులు

ఈనెల 20న ఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది...

Update: 2023-04-19 14:17 GMT

దిశ,డైనమిక్ బ్యూరో: ఈనెల 20న ఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఐఎండీ అంచనాల ప్రకారం గురువారం 125 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం 40 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలు విపత్తుల సంస్థ మెసెజ్ అందినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గురువారం మన్యం జిల్లా కొమరాడ, పార్వతీపురం కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్రవడగాల్పు వీచే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. అల్లూరి జిల్లా 7, అనకాపల్లి 15, తూర్పుగోదావరి 4, ఏలూరు 2, గుంటూరు 11, కాకినాడ 10, కృష్ణా 4, ఎన్టీఆర్ 12, పల్నాడు5, పార్వతీపురంమన్యం 11, శ్రీకాకుళం 13, విశాఖపట్నం 2, విజయనగరం 23, వైఎస్ఆర్ జిల్లాలో 6 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది అని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

కాగా బుధవారం అనకాపల్లి 8, విజయనగరం ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచాయని పేర్కొన్నారు. మరో 93 మండలాల్లో వడగాల్పులు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: Tirupati: రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు

Tags:    

Similar News