నేటి నుంచి ఏపీలో భూముల ధరలకు రెక్కలు

ఏపీలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. భూముల ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2023-06-01 04:28 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. భూముల ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూముల ధరలను పెంచామని ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్లకు.. సబ్ రిజిస్ట్రార్లకు సమాచారం అందింది. భూముల ధరల పెంపునకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలని రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యధిక ఆదాయం ఇచ్చే గ్రామాల్లో భూముల ధరలు పెరిగాయి. భూముల ధరలు 30 నుంచి 35 శాతం వరకు పెరిగాయి. గతేడాది భూమి విలువ పెరిగిన కొత్త జిల్లాల్లో కాస్త తక్కువగానే పెంచినా ఇతర ప్రాంతాల్లో మాత్రం ధరలు పెరిగాయి. . ఎక్కడైతే రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎక్కువ జరుగుతాయో.. ఆ ప్రాంతాల్లో భూముల ధరలను ఎక్కువగా పెంచారు. ఎన్టీఆర్ జిల్లాలో 7 మండలాల్లో మాత్రమే రేట్లు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 2318 ప్రాంతాల్లో భూముల ధరలకు సవరణ జరిగినట్లు సమాచారం. ధరలను జాయింట్ కలెక్టర్లు ఫైనల్ చేశారు. దీంతో నేటి నుంచి ఏపీలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. 

Tags:    

Similar News