Amaravati: హైకోర్టులో చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్.. రేపు విచారణ...!

చంద్రబాబు తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ...

Update: 2023-09-12 05:56 GMT

దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రిలో జైలులో ప్రత్యేక ఖైదీగా ఉన్నారు. మరోవైపు చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్ధంగా జరిగిందని పిటిషన్ దాఖలు చేశారు. ఎక్కడైతే చంద్రబాబును అరెస్ట్ చేశారో అక్కడ కాకుండా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌కు సంబంధించి బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తరుఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్  వాదనలు వినిపించనున్నారు. 

More News : దబిడి దిబిడే: చంద్రబాబు అరెస్ట్‌తో రంగంలోకి బాలకృష్ణ...సిద్ధమవుతున్న బ్లూ ప్రింట్

ముందే ప్లాన్ చేసి చంద్రబాబుపై కేసు పెట్టారు : Nandamuri Balakrishna

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News