వైఎస్ షర్మిల ఎఫెక్ట్.. కడప జిల్లా నేతలకు సీఎం జగన్ కీలక సూచనలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల ఎఫెక్ట్ భారీగా పని చేస్తోంది...

Update: 2024-03-21 13:19 GMT

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల ఎఫెక్ట్ భారీగా పని చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుండటంతో ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ అధిష్టానానికి రిపోర్టులు కూడా పంపించారని సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కూడా అలర్ట్ అయ్యారు. రానున్న ఎన్నికల్లో కడప అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌లో గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు కడప జిల్లాపై ఫోకస్ పెట్టారు. తాజాగా కడప జిల్లా నేతలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కడప జిల్లాలోని తాజా పరిస్థితులపై వారిని అడిగి తెలుసుకున్నారు. త్వరలో ప్రారంభంకాబోతున్న తన బస్సు యాత్రపైనా వారితో మంతనాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలోని అన్ని సీట్లను గెలవబోతున్నట్లు వారికి తెలిపారు.

ప్రధానంగా ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్నదానిపైనా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభావం ఏ మేరకు ఉంటుందనే అంశాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. అటు షర్మిల అంశాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కడప ఎంపీ బరిలో ఆమె దిగితే ఏం చేయాలన్నదానిపైనా సమాలోచనలు చేశారు. అటు రాయలసీమతో పాటు కడప జిల్లాలో షర్మిల ప్రభావం ఎంత ఉంటుందనే అంచనాలపైనా ఆరా తీశారు. మే 13న పోలింగ్ జరగనుండటంతో నియోజకవర్గంలోని ప్రతి వైసీపీ నాయకుడు, కార్యకర్త ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. 

Read More..

YS అవినాశ్ రెడ్డితో ఏం ప్రయోజనం లేదు.. షర్మిల కీలక వ్యాఖ్యలు 

Tags:    

Similar News